Breaking News

'కొణిదెల లావణ్య త్రిపాఠి'గా మొదటి సినిమా ప్రకటన

Published on Sun, 12/15/2024 - 15:28

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాను ప్రకటించారు. గతేడాదిలో వరుణ్‌ తేజ్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన ఆమె సుమారు ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. లావణ్య సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందంటూ కూడా నెట్టింట ప్రచారం జరిగింది. కానీ, నేడు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే, ఈ సినిమాతో కొణిదెల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్‌ కార్డ్‌ ఉపయోగించడం విశేషం.

'స‌తీ లీలావ‌తి' అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్నట్లు లావ‌ణ్య త్రిపాఠి ప్రకటించారు. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా ఒక వీడియోను సోషల్‌మీడియాలో పంచుకుంది.  భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతో  గుర్తింపు తెచ్చుకున్న  తాతినేని సత్యనే ఈ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌పై నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

అందాల రాక్ష‌సి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లావ‌ణ్య త్రిపాఠి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పుడు తన వివాహం అయిన తర్వాత గ్లామర్‌ రోల్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపే మొగ్గుచూపుతుంది.  ఈ క్రమంలోనే స‌తీ లీలావ‌తి చిత్రంలో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనుంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ పనులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్న ఇతర నటీనటులు  ఎవరనేది ఇంకా రివీల్‌ చేయలేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)