Breaking News

చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్.. ఇచ్చిపడేసిన మెగా కోడలు

Published on Wed, 02/04/2026 - 09:25

2026 మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' సినిమాతో వచ్చిన చిరంజీవి.. చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన హిట్ కొట్టారు. జనవరి చివరి రోజున చిరు మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కవలలు(మగబిడ్డ, ఆడబిడ్డ) పుట్టారు. రెండు మూడు రోజుల క్రితం ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. అదే టైంలో చిరు గతంలో 'మెగా వారసుడి' అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి చిరంజీవిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. వీటిపై మెగాకోడలు లావణ్య త్రిపాఠి స్పందించింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

(ఇదీ చదవండి: మహేశ్‌తో చేయడానికి అందుకే 15 ఏళ్లు.. 'వారణాసి' సీక్వెల్‌పై క్లారిటీ)

మెగా కుటుంబంలో ఇప్పటి జనరేషన్‌లో దాదాపు అందరూ అమ్మాయిలే ఉన్నారు. దీని గురించి గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన చిరు.. మెగా లెగసీని ముందుకు తీసుకెళ్లే వారసుడి కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్న కొందరు.. ఆడపిల్లలు, మహిళలని చిరంజీవి చులకనగా చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లావణ్య.. ఇలాంటి చీప్ కామెంట్స్ ఊహించలేదని ఒక యూజర్‌కి గట్టిగా ఇచ్చిపడేసింది.

'సాధారణంగా ఇలాంటి ట్వీట్లని పట్టించుకోకుండా వదిలేస్తాను. ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. ఓ సంతోషకరమైన క్షణాన్ని ఇలా విషపూరితంగా మార్చడం చాలా నీచమైన ఆలోచన. చిరంజీవి కుటుంబంలోని మహిళలని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో.. ఈ విమర్శలు చేసేవారికి అసలు అవగాహన లేదు. చిరంజీవి తన కుటుంబానికి ఇచ్చే విలువ చాలామందికి సాధ్యం కాదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వంపై వ‍్యాఖ్యలు చేయడం సరికాదు' అని లావణ్య ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ చేసిన కాసేపటికే.. సదరు యూజర్ తన ట్వీట్ డిలీట్ చేశాడు.

(ఇదీ చదవండి: 2026పై నెట్‌ఫ్లిక్స్ దండయాత్ర.. ఇన్ని సినిమాలు, సిరీస్‌లా?)

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)