Breaking News

మస్తాన్ సాయి అరెస్ట్.. లావణ్య ఫిర్యాదులో సంచలన విషయాలు!

Published on Mon, 02/03/2025 - 18:34

రాజ్ తరుణ్- లావణ్య వివాదం టాలీవుడ్‌లో సంచలనంగా సృష్టించింది. గతేడాది ఒకరిపై ఒకరు కేసులతో పాటు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాము విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అని నార్సింగి పోలీసులకు తాజాగా లావణ్య ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఫిర్యాదులో సంచలన విషయాలు..

మస్తాన్ సాయిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య ోసంచలన విషయాలు బయటపెట్టింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందించినట్లు లావణ్య వెల్లడించింది.

హార్డ్‌ డిస్క్‌లో 300 వీడియోలు..

పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లో దాదాపు 300లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో లావణ్యకు సంబంధించినవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అ‍న్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది.

 మస్తాన్ సాయి పెన్ డ్రైవ్ లో బడా స్టార్ల ప్రైవేట్ వీడియోలు

ఆధారాలతో వచ్చా- లావణ్య

మస్తాన్ సాయిపై అన్నీ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశానని లావణ్య తెలిపింది. గతంలో నా వద్ద ఆధారాలు లేవని.. అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. ఇప్పుడు వీడియోలతో సహా నా వద్ద ఉన్న ఆధారాలు నార్సింగి పోలీసులకు ఇచ్చానని లావణ్య పేర్కొంది. దీంతో ఈ కేసు మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 

ప్రాణహాని ఉంది..లావణ్య

మస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు యత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హార్డ్‌ డిస్క్‌ను పోలీసులకు అప్పగించానని లావణ్య పేర్కొంది.
 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు