హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎంజీఆర్‌ మనువడు.. రిలీజ్‌కు రెడీ

Published on Sun, 01/08/2023 - 08:46

తమిళసినిమా: ఎంజీఆర్‌ మనవడు జూనియర్‌ ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబన్‌. నటి ఐశ్వర్య దత్తా నాయకిగా నటించిన ఇందులో నటుడు యోగిబాబు, సెండ్రాయన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కీరా దర్శకత్వంలో తమిళ్‌ బాలా, ఆర్‌.వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక కేకేనగర్‌లోని శాంతి మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో నిర్వహించారు.

ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్‌ చిత్ర ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరంభ దశలో నటుడు విజయ్‌కు ఆయన తండ్రి దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ సపోర్ట్‌ చేశారని, అయితే విజయ్‌ సూపర్‌స్టార్‌గా ఎదగడానికి ఆయన కఠిన శ్రమే కారణమన్నారు. ఇప్పుడు డాన్స్‌లో ఇండియాలోనే విజయ్‌ను మించిన వారు లేరన్నారు.

నటుడు ధనుష్‌కు కూడా మొదట్లో ఆయన తండ్రి అండగా ఉన్నారని, తన ప్రతిభతోనే అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీఆర్‌ మనవడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న జూనియన్‌ ఎంజీఆర్‌ కూడా కష్టపడితేనే తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇరుంబన్‌ చిత్ర పాటలు, ట్రైలర్‌ బాగున్నాయని సీమాన్‌ అన్నారు. చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)