Breaking News

బక్రీద్‌ కానుకగా ఓటీటీలో 'లాల్‌ సలామ్‌'.. అధికారిక ప్రకటన

Published on Sat, 05/31/2025 - 07:05

సౌత్‌ ఇండియాలో  భారీ అంచనాలతో రజనీకాంత్‌  'లాల్‌ సలామ్‌'(Lal salaam) (2024) విడుదలైంది. అయితే,  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ  (Rajinikanth) అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్‌ ఓటీటీ రిలీజ్‌ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించారు

బక్రీద్‌ పండుగ కానుకగా జూన్‌ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సన్‌ నెక్ట్స్‌(Sun NXT) ప్రకటించింది. ఎదురుచూపులకు తెర పడింది అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే, బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ ఢీల్స్‌ మొదట నెట్‌ఫ్లిక్స్‌తో కుదుర్చుకుంది. అయితే, సినిమా విడుదల సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ సూచించిన సీన్స్‌ కలపకపోవడంతో ఆ ఢీల్‌ను క్యాన్సల్‌ చేసుకున్నారు. దీంతో లాల్‌ సలామ్‌ ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం అయింది.

కథేంటంటే
'లాల్‌ సలామ్‌' కథ మొత్తం  1990ల కాలం బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తోంది.  మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్‌ (విక్రాంత్‌)ను క్రికెటర్‌ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్‌ - ఎంసీసీ టీమ్స్‌ మధ్య జరిగే క్రికెట్‌ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్‌ చేతిని నరికేస్తాడు గురు అలియాస్‌ గురునాథం (విష్ణు విశాల్‌).. దాడి చేసిన గురు కూడా  మొయిదీన్ భాయ్‌కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్‌ లివింగ్‌స్టోన్‌) కుమారుడు కావడం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్‌ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్‌  అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్‌లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్‌ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్‌ 6న సన్‌ నెక్ట్స్‌లో లాల్‌ సలామ్‌ చూడాల్సిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)