Breaking News

రజనీకాంత్ వల్లే నా భార్య బతికి ఉంది: ప్రముఖ నటుడు

Published on Sun, 03/10/2024 - 08:01

కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో జె లివింగ్‌స్టన్‌కు మంచి గుర్తింపు ఉంది. స్క్రీన్ రైటర్, నటుడిగా ఆయన చాలా సినిమాలకు పనిచేశారు. దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన గతంలో హీరోగా కూడా పలు సినిమాల్లో కనిపించాడు. రజనీకాంత్, విజయకాంత్, అజిత్‌ వంటి సూపర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయనకు ప్రస్తుతం చిన్న పాత్రలకే పరిమితం అయ్యారు. కొన్నేళ్లుగా భారీ సినిమాల్లో ఛాన్స్‌లు దక్కడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయనకు రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందుకు రజనీనే సాయం చేశారు. రీసెంట్‌గా 'లాల్ సలామ్' చిత్రంలో చాన్స్‌ దక్కడంతో అందులో మెప్పించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌ గురించి లివింగ్‌స్టన్‌ ఇలా మాట్లాడారు.  'లాల్ సలామ్‌లో రజనీకాంత్ స్నేహితుడిగా నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నా సతీమణి జెస్సీకి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో అయితే చేర్పించాము కానీ అందుకు సరిపోయే డబ్బు నా వద్ద లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో నేను ఉన్నాను.  అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా ఈ వార్త ఎలాగో రజనీ సర్ చెవులకు చేరింది. ఆ సమయంలో వెంటనే నాకు రజనీ సార్‌ ఫోన్ చేసి పరామర్శించారు. ఆపై ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. నేను నిన్ను అన్నయ్యలా చూస్తున్నాను ఎంత అవసరమో చెప్పు అని రజనీ గారు పదేపదే అడిగారు.

నా సతీమణి వైద్య ఖర్చుల కోసం అవసరమైన రూ. 15 లక్షల రూపాయలు రజనీ సార్‌ పంపించారు. నేను ఇప్పటికే అప్పుల్లో ఉన్నానని, మళ్లీ తిరిగి ఇవ్వలేనని ఆయనకు తెలుసు.. అయినా సాయం చేశారు. సూపర్‌స్టార్‌ సాయం చేయకుంటే నేను నా భార్యను రక్షించేవాడిని కాదు. రజనీ సార్‌ది గోల్డెన్ హార్ట్, నాకే కాదు నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టులకు సరైన సమయంలో సహాయం చేసి వారి కుటుంబాల్లో సంతోషం నింపిన గుండె ఆయనది.' అని ఆయన అన్నారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?