Breaking News

క‌మెడియ‌న్‌తో జోడీ క‌ట్ట‌నున్న చంద్ర‌ముఖి 2 న‌టి

Published on Wed, 11/01/2023 - 18:02

కుంకీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది మాలీవుడ్‌ భామ లక్ష్మీ మీనన్‌. ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో ఈమెకు అవకాశాలు వరుస కట్టాయి. అలా విశాల్‌, విజయ్‌ సేతుపతి, విమల్‌ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకానొక‌ సమయంలో విశాల్‌తో ల‌వ్‌లో ఉందంటూ పుకార్లు కూడా వెలువ‌డ్డాయి. 

హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలంటూ సినిమాల‌కు గ్యాప్‌ ఇచ్చింది. అయితే అదే ఆమె చేసిన పెద్ద తప్పిదంగా మారింది. సినీ పరిశ్రమ లక్ష్మీ మీనన్‌ను దాదాపు మర్చిపోయే ప‌రిస్థితి వచ్చింది. మళ్లీ నటించటానికి సిద్ధం అని చెప్పినా ఆమె గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఒక‌టీరెండు అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ పెద్ద‌గా క్లిక్ అవ‌లేదు. అలాంటిది ఇటీవల చంద్రముఖి– 2 చిత్రంలో సడన్‌గా మెరిసింది. ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించింది. ఈ సినిమా రిలీజైన త‌ర్వాత గానీ అందులో లక్ష్మీమీనన్‌ నటించిందనే విషయం తెలియలేదు. 

తాజాగా ఈ బ్యూటీకి మరో అవకాశం వరించినట్లు సమాచారం. ప్రముఖ హాస్య నటుడు యోగిబాబుతో జతకట్టడానికి లక్ష్మీ మీనన్‌ సిద్ధమవుతోందని తెలిసింది. ఒక పక్క హీరోగానూ, మరో పక్క ప్రముఖ హీరోల చిత్రాల్లో హాస్య పాత్రలు పోషిస్తూ బిజీగా ఉన్న యోగిబాబు సరసన నటించి లక్ష్మీ మీనన్‌ తన అదృష్టాన్ని మ‌రోసారి పరీక్షించుకోనుందన్న మాట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: సలార్‌ కోసం కన్నడలో ప్రభాస్‌కు డబ్బింగ్‌ చెప్పిన కేజీఎఫ్‌ విలన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)