Breaking News

పరారీలో మలయాళ హీరోయిన్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్

Published on Wed, 08/27/2025 - 14:12

హీరోయిన్లు అయితే సినిమాలు చేస్తుంటారు. లేదంటే సైలెంట్‌గానే ఉంటారు. పెద్దగా వార్తల్లో నిలవాలని అనుకోరు. కానీ కొందరు మాత్రం అతిగా ప్రవర్తిస్తుంటారు. ప్రముఖ హీరోయిన్ ఇప్పుడు అలానే ఓ ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుంది. ప్రస్తుతానికైతే ఈమె పరారీలో ఉంది. కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఏమైంది?
కేరళ కొచ్చికి చెందిన లక్ష‍్మీ మేనన్.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా చేసింది. 2011 నుంచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది 'శబ్దం' అనే మూవీ చేసింది. గజరాజు, ఇంద్రుడు, చంద్రముఖి 2 లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఈమె కాస్త పరిచయమే. అలాంటిది ఇప్పుడు నిజ జీవితంలోనూ రౌడీలా ప్రవర్తించింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: భాగ్యశ్రీ ఫ్యాన్స్‌ని హర్ట్ చేసిన 'కింగ్డమ్' ఓటీటీ వెర్షన్)

ఆదివారం (ఆగస్టు 24) రాత్రి కొచ్చిలోని ఓ బార్ దగ్గర లక్ష‍్మీ మేనన్, ఆమె ఫ్రెండ్స్‌కి మరికొందరితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తమపై అరుస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేశారు. తమ కారులో ఎక్కించుకుని బెదిరించి, బూతులు తిట్టి హింసించారు. కాసేపటి తర్వాత ఆమెని మరో చోట విడిచిపెట్టారు. ఈ సంఘటన తర్వాత బాధితురాలు ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

విచారించిన పోలీసులు.. గొడవకు కారణమైన లక్ష‍్మీ మేనన్ స్నేహితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నటి కోసం ప్రయత్నిస్తుంటే ఆమె ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న లక్ష‍్మీ మేనన్‌ని పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లక్ష‍్మీ మేనన్ గ్యాంగ్.. ఐటీ ఎంప్లాయ్‌ని బెదిరిస్తున్న ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ)

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు