Breaking News

ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్‌

Published on Tue, 11/19/2024 - 14:49

సాయిరోనాక్‌, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్‌ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్‌లో ఉన్నతంగా నిర్మించారు.  అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.

'లగ్గం' సినిమాలో సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్‌తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.

కథ ఏంటంటే?
సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్‌వేర్ లైఫ్  చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని  ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.

ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..

'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్‌ అర్జున్‌ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్‌ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్‌లో కూడా మంచి వ్యూస్‌ వచ్చాయి.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)