Breaking News

2023 భారీ డిజాస్టర్‌ సినిమా ఇదే.. రూ. 45 కోట్ల బడ్జెట్‌కు లక్ష మాత్రమే వచ్చింది

Published on Sun, 12/31/2023 - 13:42

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని అంచనాలకు మించి కలెక్షన్స్‌ రాబట్టాయి. నేడు ఇండియన్‌ సినిమాను ప్రపంచ దేశాలు కూడా దగ్గర చేర్చుకుంటున్నాయి. ఒక సినిమా కోసం నెలల పాటు కష్టపడటమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. సినిమా బాగుంటే థియేటర్‌ ప్రేక్షకుల నుంచి వచ్చే డబ్బే కాకుండా శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్ ఇలా పలు రకాలుగా తిరిగి పొందుతారు. అదే సినిమా బాగలేదని టాక్‌ వస్తే మొదటి రోజు నుంచే ఆ థియేటర్‌ వైపు వెళ్లరు. దీంతో నిర్మాతకు కోట్ల రూపాయల నష్టం తప్పదు.

2023లో కొన్ని వందల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్​ హీరో అర్జున్ కపూర్​ - హీరోయిన్​ భూమి పెడ్నేకర్ నటించిన 'ది లేడీ కిల్లర్' నవంబర్ 3న విడుదలైంది. ఈ చిత్రం దారుణమైన వసూళ్లను అందుకుంది. బాలీవుడ్‌లో వీళ్లు అల్లాటప్పా యాక్టర్లు ఏమీ కాదు.. అక్కడ టాప్‌ రేంజ్‌లో వారికి గుర్తింపు ఉంది కాబట్టే ఈ సినిమా కోసం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ నిర్మాతకు ఫైనల్‌గా కేవలం రూ. లక్ష మాత్రమే వచ్చింది. నమ్మలేకున్నా ఇదే నిజం. 2023లో విడుదల అయిన ఇండియన్‌ చిత్ర పరిశ్రమలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ సినిమా కలెక్షన్స్‌ ఉన్నాయి.

ఈ చిత్రాన్ని అజయ్ బెహల్ దర్శకత్వం వహించారు. శైలేష్ సింగ్, సాహిల్ మీర్ చందానీ నిర్మించారు. టీ-సీరీస్ వాళ్ల భాగస్వామ్యంతో ఈ సినిమా విడుదలైంది. మొత్తంగా ముంబై, ఢిల్లీ కలిపి 11 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు. సినిమా షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు అప్పటికే భారీగా బడ్జెట్‌ పెట్టేశారు. మళ్లీ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు.. దీంతో  సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండానే విడుదల చేశారు.   

సినిమాలో కథతో పాటు ఏ ఒక్క విషయం కూడ ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. మొదటిరోజు కేవలం 293 టికెట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి.  ఐఎండీబీలో కూడా కేవలం 1.5 రేటింగ్‌తో  'ది లేడీ కిల్లర్' ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్  తీసుకుంది. అందుకు గాను నిర్మాతకు ఎంత చెల్లించారనేది తెలియదు. ఓటీటీలో కూడా ఆ చిత్రం వ్యూస్‌ మరీ దారుణంగా ఉన్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)