Breaking News

నాగచైతన్య పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కీలక పాత్రలో లాపతా లేడీస్ నటుడు!

Published on Tue, 01/21/2025 - 20:43

అక్కినేని నాగచైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్‌లో చైతూ వంట వండుతున్న వీడియోలు వైరలయ్యాయి. అంతేకాకుండా నమో నమశ్శివాయ అనే రెండో లికరికల్ సింగిల్‌ను కూడా మేకర్స్  విడుదల చేశారు.

అయితే ఈ మూవీ తర్వాత చైతూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. ఎన్‌సీ24 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ  చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. విరూపాక్ష మూవీతో హిట్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.

విలన్‌గా లపట్టా లేడీస్ నటుడు..

అయితే ఈ మూవీలో లాపతా లేడీస్ యాక్టర్ స్పార్ష్ శ్రీవాస్తవ నటిస్తారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. అమిర్ ఖాన్- కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ గతేడాది విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తన అమాయకమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు శ్రీవాస్తవ. దీంతో నాగ చైతన్య రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో శ్రీవాస్తవ విలన్‌గా చేయనున్నారని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. 

అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కాగా.. గతంలో చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఎన్‌సీ24 మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మూవీలో నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

lapatta

 

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)