Breaking News

బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!

Published on Fri, 04/04/2025 - 16:08

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్‌2: ఎంపురాన్'. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటేసిన లూసిఫర్ సీక్వెల్‌..  తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.  గతేడాది సూపర్‌హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. మంజుమ్మల్‌ బాయ్స్‌ రూ.242 కోట్లతో  సాధించి మలయాళ మూవీ ఇండస్ట్రీలో రికార్డుకెక్కింది. తాజాగా ఆ రికార్డ్‌ను లూసిఫర్‌-2 అధిగమించింది. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2019లో వచ్చిన లూసిఫర్‌ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌  నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో  లూసిఫర్‌2 చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక దేశీయంగా వసూళ్లు పరిశీలిస్తే రూ.88.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అలాగే ఓవర్‌సీస్‌లోనే ఎెంపురాన్‌ అద్భుతాలు సృష్టిస్తోంది. ఏకంగా రూ.103 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో ఖాయంగా కనిపిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)