Breaking News

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

Published on Tue, 11/10/2026 - 17:27

బాలీవుడ్‌ క్యూట్‌ జోడి కియారా అద్వానీ–సిద్ధార్థ్‌ మల్హోత్రా తొలిసారి ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌ 9లో కలిసి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌ బుధవారం రాత్రి 7 గంటలకు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ముఖ్యంగా డేట్‌ నైట్స్‌పై కియారా చేసిన సరదా వ్యాఖ్య ఆకట్టుకుంటోంది.

అబ్‌ బస్‌ హో గయా
పెళ్లి తర్వాత కూడా డిన్నర్‌ పూర్తయ్యాక డేట్‌ నైట్స్‌ కొనసాగిస్తారా? అని హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ ఈ జంటను ప్రశ్నించాడు. దీనికి కియారా తన బేబీ బంప్‌ను చూపిస్తూ ‘అబ్‌ బస్‌ హో గయా’ (ఇక చాలు) అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంతో అక్కడ నవ్వులు పూశాయి. దీనిపై సిద్ధార్థ్‌ కూడా సరదాగా స్పందించాడు. తమ వృత్తికి సంబంధించిన విషయాలను ఇంటికి తీసుకురావాలని తాము అనుకోవడం లేదని, ముఖ్యంగా బెడ్‌రూమ్‌లోకి మాత్రం వాటిని తీసుకురామని చెప్పాడు.

(చదవండి: 'అలా చేయడం అమానుషం'.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్)

ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కరణ్‌ జోహార్‌తో ఈ జంట పంచుకుంది. పెళ్లిలో కరణ్‌ ఏ పాటకు డ్యాన్స్‌ చేశాడో చెప్పాలంటూ కియారా అతడిని ఆటపట్టించింది. అలాగే నటుడు షాహిద్‌ కపూర్‌ తనతో కలిసి స్టేజ్‌పైకి వచ్చాడని, ఆ తర్వాత కరణ్‌ అతడిని స్టేజ్‌ నుంచి దించేశాడని గుర్తుచేసుకుంది.

కాగా.. కియారా, సిద్ధార్థ్‌ తమ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన విషయాన్ని  అక్టోబర్‌ 7న ఈ జంట అధికారికంగా ప్రకటించింది. 2025లో వీరికి తొలి సంతానంగా కుమార్తె జన్మించింది.

Videos

ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్

ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన MPTC శ్రావణి

AP హైకోర్టులో YS జగన్ పిటిషన్ పై విచారణ

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

Photos

+5

సిద్దు జొన్నలగడ్డ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)

+5

'గోట్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. దివ్య భారతి హైలైట్! (ఫొటోలు)

+5

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి హీరో రిషబ్ శెట్టి దీపావళి వేడుకలు (ఫోటోలు)

+5

వరంగల్ : నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ (ఫోటోలు)

+5

‘మాయలేడి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : డీజే సంగీత హోరు.. దున్నరాజుల విన్యాసాలు (ఫోటోలు)

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)