Breaking News

ఖుషి సక్సెస్‌.. యాదాద్రిలో విజయ్‌ దేవరకొండ.. లేడీ ఫ్యాన్‌ అత్యుత్సాహం

Published on Sun, 09/03/2023 - 16:05

హిట్టు కోసం అల్లాడిపోయాడు విజయ్‌ దేవరకొండ. ఈ రౌడీ హీరో ఒక్కడేనా? అటు హీరోయిన్‌ సమంత, ఇటు డైరెక్టర్‌ శివ నిర్వాణ.. అందరూ హిట్‌ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు వీరి ముగ్గురికీ ఖుషి రూపంలో సక్సెస్‌ దొరికింది. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఖుషి సినిమాకు సానుకూల స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.

ఈ క్రమంలో విజయ్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒక అమ్మాయి అయితే ఏకంగా విజయ్‌ను హత్తుకునేందుకు ప్రయత్నించింది. బాడీగార్డులు ఆమెను అడ్డుకోవడంతో చివరకు ఫోటో దిగి సంతృప్తి చెందింది. దర్శనానంతరం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా బ్రదర్ బేబీ మూవీ, నేను నటించిన ఖుషి రెండూ సక్సెస్ అయ్యాయి. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాను.

కొన్నేండ్ల కిందట నేను యాదాద్రికి వచ్చినప్పుడు గుడి ఇంత బాగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఖుషి హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా' అని చెప్పాడు.

చదవండి: హీరోయిన్‌ సమంత ఎక్కడ?.. విజయ్‌ దేవరకొండను ప్రశ్నించిన నాగ్‌.. రూ.35 లక్షలు ఆఫర్‌..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)