ఎన్టీఆర్‌ కోసం ఫ్యాన్స్‌ వందల కిలోమీటర్ల పాదయాత్ర

Published on Fri, 11/15/2024 - 15:06

తనని ప్రేమించే ఫ్యాన్స్‌ అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఎనలేని అభిమానం. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులపై కూడా ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు. అందుకే తారక్‌ ‍ప్రతి ఆడియో ఫంక్షన్‌లో అభిమానులు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, వారి కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ఉంటారని సూచిస్తాడు. ఫ్యాన్స్‌పై ఆయన చూపించే ఇలాంటి ప్రేమనే నేడు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది.

కుప్పంలోని గుడుపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులు తమ అభిమాన నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు.  సోడిగానిపల్లి పంచాయతీ పాళెం గ్రామానికి చెందిన జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు శివ, హరి, లక్ష్మీపతి, కదిరప్ప పాద యాత్ర ద్వారా హైదరాబాద్‌ చేరుకుని జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశారు. నవంబర్‌ 3న వారు తమ ఇంటి నుంచి ప్రయాణించారు. తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్‌లోని జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాసం వరకూ ‘వేసే ప్రతి అడుగు జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్న కోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. 

దాదాపు 650 కిలోమీటర్లు పైగా కాలినడకన హైదరాబాద్‌ చేరుకుని ఎన్టీఆర్‌  కలుసుకున్నారు.  కుప్పం నుంచి హైదరాబాద్‌ చేరుకునేందుకు వారికి సుమారు 13 రోజుల సమయం పట్టింది. తారక్‌పై వారు చూపించిన ప్రేమకు  కుప్పం జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు శివరాయల్‌ వారికి సంఘీభావం తెలిపారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)