Breaking News

టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!

Published on Wed, 02/07/2024 - 11:05

'మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ ట్రా'.. ఈ డైలాగ్ చెప్పగానే ఈపాటికే మేటర్ అర్థమైపోయింటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల మీడియాలో తెగ పాపులర్ అయిపోతున్న కుమారి ఆంటీదే ఈ డైలాగ్. హైదరాబాద్‌లోని రోడ్డు సైడ్ మధ్యాహ్న భోజనం అమ్మే ఈవిడ.. ఫుడ్ వ్లాగర్స్ వల్ల చిన్న సైజు సెలబ్రిటీ అయిపోయింది. ఆల్రెడీ ఈమెని పలువురు ఇంటర్వ్యూ చేయగా.. ఇప్పుడు ఏకంగా ఓ టీవీ షోలో కూడా కనిపించింది.

(ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్)

గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నాన్ వెజ్ మీల్స్ విక్రయించే ఈమె.. అనుకోకుండా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈమె షాప్ దగ్గరకు జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అవుతుందని చెప్పి షాప్ మూసివేయడం.. ఈ గొడవపై ఏకంగా తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి స్పందించడం. ఇప్పుడు యధావిధిగా మళ్లీ ఈమె బిజినెస్ రన్ అవుతుండటం.. ఇలా గత కొన్నాళ్ల నుంచి కుమారి ఆంటీ వార్తల్లో నిలుస్తోంది.

అయితే సోషల్ మీడియాలో ఈమె ఫేమస్ అయినప్పుడే ఇంకెందుకు లేటు.. టీవీ షోల్లో కూడా కనిపిస్తుందని ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. 'బిగ్‌బాస్ 7' కంటెస్టెంట్స్ అందరూ కలిసి తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో కుమారి ఆంటీ కూడా పాల్గొంది. స్టేజీపైనే అందరికీ తన స్టైల్ ఫుడ్ తినిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈమెతో ఓ స్కిట్ కూడా చేయించారని టాక్. 

(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)