Breaking News

'కుబేర' రెండో రోజు కలెక్షన్స్‌.. మొత్తం ఎన్ని కోట్లు?

Published on Sun, 06/22/2025 - 16:29

ఈ వారం ఓ మాదిరి అంచనాలతో రిలీజైంది 'కుబేర'. రిలీజ్‌కి ముందు బుకింగ్స్ కూడా అలా అలా అన్నట్లే ఉన్నాయి. ఎ‍ప్పుడైతే మార్నింగ్ షో పూర్తయి పాజిటివ్ టాక్ వచ్చిందో మిగతా షోలన్నీ హౌస్‌ఫుల్స్ కావడం మొదలుపెట్టాయి. అలా తొలిరోజు యావరేజ్ వసూళ్లు రాగా.. రెండో రోజు వచ్చేసరికి ఆ నంబర్స్ కాస్త పెరిగాయి. ఇంతకీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

ధనుష్ నటించిన 'కుబేర'.. ఓ బిచ్చగాడు ఓ మల్టీ మిలియనీర్ మధ్య సాగే థ్రిల్లింగ్ డ్రామా కథతో తీశారు. బిచ్చగాడిగా ధనుష్ విశ్వరూపం చూపిస్తే.. సీబీఐ అధికారిగా నాగ్ ఆకట్టుకున్నాడు. రష్మిక కూడా తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. దేవిశ్రీ ప్రసాద్ కూడా తనదైన మ్యూజిక్‌తో మార్కులు కొట్టేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తన రూట్ మార్చి హిట్ కొట్టేశాడు.

(ఇదీ చదవండి: 'కుబేర' రెమ్యునరేషన్.. ఎవరికి ఎంత?)

ఇలా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'కుబేర'కు తొలిరోజు మన దేశంలో రూ.14 కోట్ల మేర నెట్ వసూళ్లు రాగా.. రెండో రోజు రూ.16 కోట్ల మేర వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రెండు రోజులకు రూ.31.25 నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. గ్రాస్ రూ.36 కోట్ల మేర ఉండొచ్చని తెలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ ప్రస్తుతం 1.4 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేశాయి. అంటే రూ.15 కోట్ల మేర వచ్చేసినట్లే. మొత్తంగా చూస్తే రూ.50 కోట్ల మార్క్ అయితే దాటేసిందని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమాకు ఎంత డబ్బులు వస్తాయో చూడాలి?

'కుబేర' విషయానికొస్తే.. ఆయిల్ రిగ్‌ని దక్కించుకోవాలని బడా వ్యాపారి నీరజ్(జిమ్ షర్బ్).. రూలింగ్ పార్టీకి లక్ష కోట్ల రూపాయల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పనిచేసేందుకు జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే ఈ డబ్బంతా పంపిణీ చేయడానికి బినామీలుగా నలుగురు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. వాళ్లలో ఒకడు దేవా(ధనుష్). ఇతడి పేరు మీద విదేశాల్లో ఓ షెల్ కంపెనీ సృష్టించి, దాని ద్వారా మినిస్టర్లకు డబ్బులు ఇవ్వాలనేది ప్లాన్. కానీ దేవా.. వీళ్ల దగ్గరనుంచి తప్పించుకుంటాడు. తర్వాత ఏమైంది? సమీర(రష్మిక) ఎవరు అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: రెండో సినిమాకే ఐదు అవార్డులు.. 'కుబేర' విలన్ ఎవరంటే?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)