Breaking News

హలో డార్లింగ్.. ప్రభాస్‌కి కేటీఆర్ 'ప్రాంక్ కాల్'

Published on Fri, 09/11/2026 - 14:25

ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఊహించని ఫోన్ కాల్‌తో అవాక్కయ్యాడు. ఇది కూడా బీఆర్ఎస్ నేత కేటీఆర్ నుంచి ఫోన్ వచ్చేసరికి కాస్త తికమక పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి ప్రాంక్ కాల్ గోల?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 'ది అండర్ 18 వరల్డ్' అనే యూత్ టాక్ షో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. అక్కడున్న పిల్లలు.. కేటీఆర్‌కు ఓ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు. మీ వ్యక్తిగత మొబైల్ నుంచి ఎవరైనా స్టార్ హీరోకు కాల్ చేయాలని అడగ్గా.. ప్రభాస్‌‌కు కాల్ చేశారు. ప్రభాస్ కూడా వెంటనే స్పందించి 'గుడ్ ఈవెనింగ్ సార్' అని పలకరించారు. కానీ కేటీఆర్ బదులుగా పక్కనే కూర్చున్న ఒక పాప ఫోన్‌ అందుకుంది. చాలా అమాయకంగా నటిస్తూ.. "సార్, నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొబైల్ దొరికింది. ఇందులో చూస్తే మీ నెంబర్ కనిపించింది.. ఇంతకీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించింది.

కేటీఆర్ నంబర్ నుంచి తనకు ఫోన్ రావడం, తీరా చూస్తే గుర్తుతెలియని చిన్నారి వాయిస్ వినిపించేసరికి ప్రభాస్‌కు ఏం అర్థం కాలేదు. దీంతో వెంటనే కాల్ కట్ చేసేశాడు. ప్రభాస్ రియాక్షన్‌ చూసి కేటీఆర్ సరదాగా నవ్వుతూ తలపట్టుకున్నారు. తర్వాత స్వయంగా కేటీఆర్ మళ్లీ ప్రభాస్‌కి కాల్ కలిపారు. ప్రభాస్ లైన్‌లోకి రాగానే అసలు విషయం చెప్పారు.

తాను ‘ది అండర్ 18 వరల్డ్’ పాడ్‌కాస్ట్ షోలో ఉన్నానని, అక్కడున్న పిల్లల కోరిక మేరకు సరదాగా ఈ ప్రాంక్ చేశామని వివరించారు. అసలు విషయం తెలుసుకున్న ప్రభాస్ పగలబడి నవ్వుతూ వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

#

Tags : 1

Videos

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

VIdeo: ఇలా కూడా బ్యాంక్ దోచేస్తారా?

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)