Breaking News

ఏఆర్‌ఎమ్‌ నాకో పెద్ద సవాల్‌: కృతీ శెట్టి

Published on Sat, 08/24/2024 - 03:21

యువ కథానాయికల్లో వరుస సినిమాలతో దూసుకెళుతున్న వారిలో కృతీ శెట్టి ఒకరు. ఈ బ్యూటీ ‘అజయంతె రందం మోషనుమ్‌’ (ఏఆర్‌ఎమ్‌) చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం కానున్నారు. వచ్చే నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళం సినిమా చేసిన అనుభవం గురించి కృతీ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – ‘‘1900, 1950, 1990.... ఈ మూడు కాలాల్లో ఈ సినిమా సాగుతుంది. ఇలాంటి సినిమాలో నటించడం అనేది ఒక మంచి అవకాశం. ఈ చిత్రంలో పూర్తి మలయాళీ గ్రామీణ అమ్మాయిలా కనిపిస్తాను. నటన పరంగా చాలా నేచురల్‌గా ఉండాలి.

చిన్న చిన్న హావభావాలతో చెప్పాల్సినదంతా చెప్పాలి. ఆ పరంగా ఇప్పటివరకూ నటించినదానికి పూర్తి భిన్నంగా అనిపించింది. అదొక సవాల్‌ అయితే మలయాళ భాష నేర్చుకోవడం మరో సవాల్‌. ఇక ఒక్కోసారి 36 నుంచి 38 గంటలు కంటిన్యూస్‌గా షూటింగ్‌ చేసేవాళ్లం. నాకంటే కార్‌వేన్‌ ఉంటుంది కాబట్టి షాట్‌ గ్యాప్‌లో అందులో విశ్రాంతి తీసుకునేదాన్ని.

అలాగే నా పాత్ర షూట్‌ పూర్తి కాగానే వెళ్లి΄ోయేదాన్ని. కానీ, షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక అన్నీ సర్దుకుని వెళ్లడానికి కొందరు సాంకేతిక నిపుణులకు టైమ్‌ పట్టేది. మరుసటి రోజు మాకన్నా ముందు సెట్లో ఉండేవాళ్లు. అలాగే ఈ చిత్రం హీరో టొవినో థామస్‌లో 36 గంటలు షూట్‌ చేసినా అలసట కనిపించేది కాదు. ఇలా ఈ సినిమా టీమ్‌ ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించింది’’ అన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)