Breaking News

ధనుష్‌కు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ

Published on Thu, 08/08/2024 - 12:50

ఎన్ని సమస్యలొచ్చినా.. తానుమాత్రం తగ్గేదేలే అంటున్నారు నటుడు ధనుష్‌. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. ఇది ఆయన 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇలా నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా,  దర్శకుడిగా సత్తా చాటుకుంటున్న ధనుష్‌కు కోలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. 

ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో నటించిన ఈయన మరోసారి బాలీవుడ్, హాలీవుడ్‌ చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఆయన నటించిన షమితాబ్, రాంజానా వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌తో ధనుష్‌కు మంచి బౌండింగ్‌ ఉంది.

ఇంతకు ముందు వీరి కాంబోలో రూపొందిన రాంజానా చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరు కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నారనే టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనికి తేరే ఇష్క్‌ మెయిన్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా ఇందులో ధనుష్‌కు జంటగా బాలీవుడ్‌ క్రేజీ నటి కృతీసనన్‌ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే తెలుగులో మహేశ్‌బాబు సరసన  నేనొక్కడినే, ప్రభాస్‌కు జంటగా ఆదిపురుష్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా ధనుష్‌తో రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇకపోతే  ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)