Breaking News

హీరోయిన్‌ ఎలా అయ్యానంటే..: కృతీ శెట్టి

Published on Sat, 11/29/2025 - 07:02

ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. అలా లక్‌తో హీరోయిన్‌ అయిన బ్యూటీ కృతీ శెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబైలో! తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్‌ డిజైనర్‌. కృతీకి నటనపై ఆసక్తి ఉండటంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే ఈమెను హీరోయిన్‌ను చేసింది.

ఉప్పెనతో హీరోయిన్‌గా
17 ఏళ్ల వయసులో ఉప్పెన మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్‌, కస్టడీ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో ఒకటీరెండు సినిమాలు మాత్రమే హిట్టవడంతో అమ్మడి క్రేజ్‌ అమాంతం తగ్గిపోయింది.

తమిళ సినిమాలు
దీంతో కేవలం టాలీవుడ్‌నే నమ్ముకోకుండా తమిళ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్‌, లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. కృతీ కెరీర్‌కు ఈ మూడు సినిమాల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. వా వాద్దియార్‌లో కార్తీతో జత కట్టగా జీనీలో రవిమోహన్‌ సరసన నటిస్తోంది. లవ్‌ ఇన్సూరెన్స్‌లో ప్రదీప్‌ రంగనాథన్‌తో కలిసి నటించింది.

హీరోయిన్‌ ఎలా అయ్యానంటే?
వా వాద్దియార్‌ త్వరలో రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో ఓ భేటీలో పాల్గొన్న కృతీ శెట్టి.. తాను హీరోయిన్‌ ఎలా అయ్యానన్నది వెల్లడించింది. ఒక వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆడిషన్స్‌కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీంతో సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయంది. 

దర్శకుడు ఫోన్‌ చేసి..
వాళ్లు తనను చూసి సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారని గుర్తు చేసుకుంది. దీంతో తన తల్లి ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి వచ్చేశానంది. ఆ తర్వాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్‌ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన మూవీలో హీరోయిన్‌గా నటించానంది. తమిళంలో కార్తీ సరసన, ప్రదీప్‌ సరసన నటించడం సంతోషంగా ఉందని కృతీ శెట్టి పేర్కొంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)