కృతిశెట్టి ఎదురుచూపులు.. ఇప్పుడా టైమ్‌ వచ్చింది

Published on Thu, 10/16/2025 - 07:13

కొందరి హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నా సరే ఒక్కోసారి విజయాలు అందని ద్రాక్షే అవుతంది. నటి కృతిశెట్టి(Krithi Shetty) పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఉప్పెన చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ..  తొలి సినిమా తర్వాత వరుసగా  విజయాలు దక్కాయి. దీంతో టాలీవుడ్‌లో దూసుకుపోతారనే ప్రచారం జరిగింది. అంతే ఆ తరువాత కృతిశెట్టి నటించిన చిత్రాలు పరాజయం పాలవడం మొదలెట్టాయి. అయితే ఆ తరువాత కోలీవుడ్‌పై దృష్టి సారించారు. అంతకుముందే తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రాలు ది వారియర్,  కస్టడీ చిత్రాలు పూర్తిగా నిరాశపరచాయి.

 అయినప్పటికీ అమ్మడికి తమిళంలో అవకాశాలు వరించాయి. అయితే అక్కడ ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉండడం గమనార్హం. తమిళంలో కృతిశెట్టి నటించిన మూడు చిత్రాలు ఇప్పుడు ఒకే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతుండడం విశేషం. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా కృతిశెట్టి కెరీర్‌కు హెల్ప్‌ అవుతుంది. దీంతో అలాంటి విజయం కోసం ఈ అమ్మడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. కార్తీకి జంటగా నటిస్తున్న వా వాద్దియార్‌ చిత్రం డిసెంబర్‌ 5న తెరపైకి రానుంది. తర్వాత ప్రదీప్‌ రంగనాథన్‌కు జంటగా లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కావలసింది. 

ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన డ్యూడ్‌ దీపావళికి తెరపైకి రానుండడంతో లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ డిసెంబర్‌కు వాయిదా పడింది. ఇకపోతే కృతి నటిస్తున్న మరో చిత్రం జీవీ. రవిమోహన్‌ నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి కే.గణేశ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో మరో నాయకిగా కల్యాణి ప్రియదర్శన్‌ నటిస్తున్నారు. వీటిలో నటి కృతిశెట్టి దశను మార్చే చిత్రం ఏది అవుతుందో చూడాలి.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)