వీటిలో ఒక్క సినిమా హిట్‌ అయితే.. కృతిశెట్టికి మళ్లీ వరుస ఛాన్సులు

Published on Tue, 09/03/2024 - 08:49

ఇటీవల విజయాల కోసం ఎదురుచూస్తున్న నటీమణుల్లో కృతిశెట్టి ఒకరు. 2019లో సూపర్‌ 3డీ అనే హిందీ చిత్రంతో తెరపై మెరిశారు. ఆ తర్వాత ఉప్పెనలా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ అందుకున్న ఈమె టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ల లిస్ట్‌లో ఉంటుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే శ్యామ్‌ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలను అందుకున్నారు. అయితే ఆ తర్వాతనే కృతిశెట్టి కెరియర్‌ అపజయాల బాట పట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు విజయాన్ని చూడలేదన్నది నిజం. 

ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో ప్రత్యేక ఫొటో షూట్‌ నిర్వహించుకొని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నా, కృతిశెట్టికి తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఎంతో ఆశతో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నాగచైతన్యకు జంటగా నటించిన ద్విభాషా (తెలుగు తమిళ్‌ ) చిత్రం కస్టడీ ఈమెను పూర్తిగా నిరాశపరిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కృతిశెట్టి పూర్తిగా వదిలేసినా, తమిళ చిత్రపరిశ్రమ మాత్రం ఈమెను ఆదరిస్తుండడం  విశేషం. 

కస్టడీ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైనా, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అలా కార్తీ సరసన 'వా వాద్దియార్‌' చిత్రంలోనూ, ప్రదీప్‌ రంగనాథ్‌ జంటగా 'ఎల్‌ఐకే' చిత్రంలోనూ, జయంరవి సరసన 'జీనీ' చిత్రంలో కృతిశెట్టి  నాయకిగా నటిస్తున్నారు. వీటిలో ఏ ఒక్క చిత్రం సక్సెస్‌ అయిన ఇక్కడ ఆమెకు రూట్‌ క్లియర్‌ అయినట్లే. అందుకే ఆమె ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారు. అయితే మలయాళంలో ఒక చిత్రంలో కృతిశెట్టి నటిస్తున్నారు. ఈమె అక్కడ నటిస్తున్న తొలి చిత్రం ఇదే అన్నది  తెలిసిందే.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)