Breaking News

ఆ కోరిక తీరకుండానే మరణిం‍చిన‍ రెబల్ స్టార్ కృష్ణంరాజు!

Published on Sun, 09/11/2022 - 07:36

సాక్షి, హైదరాబాద్‌: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు. ప్రభాస్‌కు జోడీ కోసం వెతుకుతున్నామని, పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలో చెబుతామని అంటుండేవారు. ప్రభాస్ పెళ్లికంటే సంతోషాన్నిచ్చే అంశం తనకు మరొకటి లేదని చెప్పేవారు. వీలైతే ప్రభాస్ పిల్లలతోనూ కలిసి నటించాలనుందని ఆయన కోరికను కూడా వెల్లడించారు.

కానీ చివరకు ఇవేవీ నెరవేరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం  వేకువజామున తుదిశ్వాస విడిచారు. దీంతో రెబల్ స్టార్ కుటుంబసభ్యులతో పాటు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్‌ వంటి పలు చిత్రాల్లో నటించారు.

ప్రభాస్, కృష్ణంరాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తనకు అందరికంటే పెదనాన్న అంటేనే ఎక్కువ భయం, గౌరవం అని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కృష్ణంరాజు కూడా ప్రభాస్‌ అంచెలంచెలుగా ఎదిగిన తీరును చూసి గర్వపడేవారు. ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని ఊహించాను కానీ, పాన్ ఇండియా స్టార్‌లా ఎదుగుతాడని అనుకోలేదని ఓ సందర్భంలో కృష్ణంరాజు అన్నారు.


చదవండి: రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కన్నుమూత

Videos

మెగాస్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్

PSLV C-61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య

ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

మీర్ చౌక్ లో భారీ అగ్నిప్రమాదం

గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే

రోహిత్‌ను నిండా ముంచిన గిల్

సుడిగుండంలో కొట్టుకుపోతారు కూటమికి CPI రామకృష్ణ మాస్ వార్నింగ్

జగన్ ను దెబ్బ తీయాలనే బాబు చిల్లర రాజకీయాలు

భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం

Low Class Politics: దావోస్ లో ఇమేజ్ డ్యామేజ్

Photos

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)