Breaking News

కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు!

Published on Mon, 09/12/2022 - 09:28

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. 

పండితుల సూచన మేరకు  ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. చదవండి:  ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు

ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్‌ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు హాజరు కానున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ చదవండి: కృష్ణంరాజు ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా..

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)