Breaking News

రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా.. రోజంతా నిద్రపట్టలేదు: కృష్ణ వంశీ

Published on Sat, 03/18/2023 - 13:19

ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానంతం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం రంగమార్తాండ. రాహుల్‌ సిప్లిగంజ్‌, అనసూయ భరద్వాజ్‌, ఆదర్శ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ముఖ్య పాత్రలు పోషించగా ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిలిం నటసామ్రాట్‌కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌.

ఈ క్రమంలో డైరెక్టర్‌ కృష్ణవంశీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'రమ్యకృష్ణ పాత్ర పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశా. మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము నిర్ణయం తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. కానీ, నేను పెద్దగా పట్టించుకోను.. అది వేరే విషయం. ఇకపోతే రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలనగానే ఆమె ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్‌, హెయిర్‌ స్టైల్‌ తనే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్‌తో ముందుకెళ్తుంది.

ఈ సినిమాలో లాస్ట్‌ చాప్టర్‌లో తనను షూట్‌ చేయడానికి చచ్చిపోయాననుకో! దాదాపు 36 గంటలపాటు షూటింగ్‌ జరిగింది. తనను ఆ సీన్‌లో చిత్రీకరించడానికి సెంటిమెంట్‌ అడ్డొచ్చింది, కానీ తప్పదు కదా! షూట్‌ చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ రాత్రి నేను సరిగా నిద్రపోలేకపోయాను. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్‌ చేశా' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు కృష్ణవంశీ.

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)