Breaking News

'ఆ డైరెక్టర్‌ నా పర్సనల్‌ ఫోటోలు నటి రేవతికి పంపాడు'

Published on Thu, 08/29/2024 - 17:22

మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి తెలుపుతూ జస్టిస్‌ హేమ కమిటీ  ఒక నివేదిక వెళ్లడించింది. దీంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మలయాళ దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై కోజికోడ్‌లోని మంకావ్‌కు చెందిన సజీర్‌ (33) సంచలన ఆరోపణలు చేశాడు. 2012లో తనపై దర్శకుడు రంజిత్‌ లైంగికదాడికి పాల్పడ్డారని కేరళ డీజీపీకి  లేఖ రాశాడు. ప్రస్తుతం కోజికోడ్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్న సజీర్.. సీనియర్‌ హీరోయిన్‌ రేవతి పేరును తెరపైకి తీసుకొచ్చి పెద్ద దుమారమే రేపాడు.

2012లో కోజికోడ్‌లో బవుత్తియుడే నమతిల్ సినిమా షూటింగ్ సమయంలో రంజిత్‌ను తొలిసారి కలిశానని సజీర్‌ ఇలా తెలిపాడు. 'ఆ సమయంలో నేను  డిప్లొమా చదువుతున్నాను. ఆ సినిమా సెట్‌ వద్దకు నేనూ వెళ్లాను. ఏదైనా సినిమాలో ఛాన్స్‌ కావాలని నేను అడగ్గానే వెంటనే ఒక టిష్యూ పేపర్‌పై తన ఫోన్‌ నంబర్‌ రాసి ఇచ్చాడు. ఆపై  బెంగళూరులోని తాజ్ హోటల్‌కు నన్ను ఆహ్వానించాడు. అయితే, రాత్రి 10 గంటల సమయంలో హోటల్‌కు నేను వెళ్లాను. 

వారు నన్ను లోపలికి అనుమతించలేదు. అయితే, రంజిత్‌ సూచనమేరకు  వెనుక గేటు ద్వారా లోపలికి వెళ్లాను. గదిలోకి నేను వెళ్లిన సమయంలో దర్శకుడు రంజిత్ మద్యం మత్తులో ఉన్నాడు. అప్పుడు నన్నూ మద్యం తీసుకోమని చెప్పడంతో జీవితంలో మొదటిసారి సేవించాను. కళ్లు బాగున్నాయంటూ దగ్గరికొచ్చి నా దుస్తులు తొలగించి రాత్రంతా  లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ సమయంలో నా ఫోటోలను కూడా రంజిత్‌ తీశాడు. అని సజీర్‌ ఫిర్యాదు చేశాడు.

'దర్శకుడు రంజిత్   గదిలోకి  వెళ్లినప్పుడు ఆయన ఒక నటితో మాట్లాడుతున్నాడు. ఆ నటి రేవతి అని రంజిత్ నాకు చెప్పాడు. రేవతి, రంజిత్‌కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. రంజిత్ నా ఫోటో తీసి వారికి పంపాడు. ఎవరికి పంపారు అని నేను అడిగాను. అప్పుడు రేవతికి పంపించానని దర్శకుడు రంజిత్ సమాధానమిచ్చాడు.  ఫోటో చూసి రేవతికి నచ్చిందని కూడా నాతో చెప్పాడు. కానీ, అటువైపు నిజంగానే రేవతినే అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. రంజిత్‌ నాతో చెప్పిన విషయాన్నే ఇప్పుడు చెబుతున్నాను.

రంజిత్‌ బాలకృష్ణన్‌పై బెంగాలీ నటి శ్రీలేఖ కూడా కొద్దిరోజుల క్రితమే కీలక ఆరోపణలు చేసింది. రంజిత్‌ తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని బహిరంగంగానే ఆమె చెప్పుకొచ్చింది. 2009లో ఒక సినిమా ఆడిషన్‌ కోసం సంప్రదిస్తే.. ఆ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. నటి ఆరోపణలపై రంజిత్‌ స్పందించాడు. అవన్నీ ఆరోపణలు మాత్రమేనని ఆయన అన్నాడు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలకు పాల్పడుతున్నారని వెళ్లడించాడు. అయితే, తాజాగా ఆరోపణలు చేసిన సజీర్‌ గురించి ఇంకా ఆయన రియాక్ట్‌ కాలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)