Breaking News

షూటింగ్‌ గ్యాప్‌లో మందు తాగినందుకు చిరంజీవి తిట్టాడు: కోట

Published on Sat, 07/22/2023 - 17:56

కామెడీ, విలనిజం.. వేర్వేరుగా, అవసరమైతే రెండింటినీ ఏకకాలంలో పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించిన ఆయన నటప్రస్థానం ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వందలకొద్దీ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి కొన్ని ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

'ఒకసారి ఏమైందంటే సెట్‌కు వెళ్లాక మధ్యాహ్నం వరకు షూటింగ్‌ లేదన్నారు. ఎమ్మెస్‌ నారాయణ.. ఏంటి అన్నాయ్‌, ఇంకా చాలా టైముందిగా అని బయటకు వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి మందు తాగాం. అనుకోకుండా షూటింగ్‌కు రమ్మని కబురొచ్చింది. సెట్‌కు వెళ్తే అక్కడ చిరంజీవి ఉన్నాడు. నన్ను చూడగానే నాపై కేకలేశాడు. ఏమయ్యా, బుద్ధుందా? మంచి కెరీర్‌ ఉన్నవాడివి పట్టపగలు తాగి రావడమేంటి? పది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది? అని తిట్టాడు. కానీ నా మంచి కోసం, నా బాగోగులు కోరే అతడు నన్ను హెచ్చరించాడు.

ఇకపోతే మండలాధీశుడులో ఎన్టీఆర్‌ పాత్ర ఆఫర్‌ చేశారు. అప్పటికే ఈ రోల్‌ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. సూపర్‌ స్టార్‌ కృష్ణగారు చేయమని ప్రోత్సాహించారు. నాకేమో ఫ్యాన్స్‌ ఎలా తీసుకుంటారోనని భయంగా ఉంది. అప్పుడు నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సినిమా సక్సెస్‌ అయితే ఇండస్ట్రీలో ఉందాం, లేదంటే ఉద్యోగంలో చేరిపోదాం అనుకున్నా. మండలాధీశుడు మంచి విజయం సాధించింది. కానీ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓసారి నా కూతుర్ని చూసేందుకు విజయవాడ వెళ్లాను. అక్కడ రైలు దిగగానే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నన్ను తిడుతూ, కొట్టారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను' అని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.

చదవండి: సుమతో విబేధాలు? రాజీవ్‌ కనకాల ఏమన్నాడంటే?
సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)