Breaking News

నిధికి కాపు కాసే ‘కొరివి’ దెయ్యం.. గ్లింప్స్‌తో భయపెట్టారుగా!

Published on Sat, 10/31/2026 - 19:43

‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి..దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె రూపొందిస్తున్న కొత్త చిత్రానికి  ‘కొరివి’ టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి..తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ సినిమా శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

(చదవండి: నా హృదయం హైదరాబాద్‌లోనే ఉంది.. త్వరలోనే వస్తా: రకుల్‌)

ఈ రోజు దర్శకుడు శ్రీధర్ గాదె బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రానికి  ‘కొరివి’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మాయా నది ప్రాంతం లో ఉన్న నిధికి కాపు కాసే ఓ కొరివి దెయ్యం కథ ఇది.. ఈ కొరివి..బిగ్ స్క్రీన్ మీద ఆడియెన్స్ కు థ్రిల్లింగ్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ టైటిల్ గ్లింప్స్ లో ఇంట్రెస్టింగ్ మేకింగ్ విజువల్స్ చూపించడం విశేషం. టైటిల్ అనౌన్స్ మెంట్, ఈ గ్లింప్స్ తో "కొరివి" మూవీ టీమ్ డైరెక్టర్ శ్రీధర్ గాదెకు బర్త్ డే విశెస్ తెలియజేసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూనిక్ హారర్ మూవీని సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె  తెరకెక్కిస్తున్నారు.

Videos

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. అవాక్ అవ్వాల్సిందే.. తులం ఎంతుందంటే..!

పోలీసుల ఓవరాక్షన్ ఇచ్చిపడేసిన BC రమేష్ గౌడ్

పోలింగ్ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు చెప్పిన ప్రత్యక్ష సాక్షులు

దటీజ్ అంబానీ! ఉద్యోగులకు భారీ బోనస్ ఎంత అంటే.!

ఎన్ కౌంటర్ ఎందుకు చేసామంటే..! ఎస్పీ జగదీష్ కామెంట్స్

SEC తీరుపై YS జగన్ తీవ్ర ఆగ్రహం

బయటి అమ్మాయినంటే మర్యాదగా ఉండదు? బొత్స అనూష ఫైర్

లడఖ్ లో కరెంటు కోసం కష్టాలు

AP Rains: 4 రోజులు నాన్-స్టాప్ వర్షాలే.. వర్షాలు

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)