Breaking News

రెండుసార్లు జైలుకెళ్లొచ్చాను: నటుడు

Published on Fri, 02/17/2023 - 09:41

కొండా సినిమాతో గుర్తింపు సంపాదించాడు ప్రశాంత్‌ కార్తి. 2017 నుంచి ఇండస్ట్రీలో ఉంటున్న ఆయనకు పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు కొండా చిత్రంతో వచ్చింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'సివిల్‌ కాంట్రాక్టర్‌ నుంచి నటుడిగా మారాను. ఈ ఫీల్డ్‌లోకి రాకముందు రెండుసార్లు జైలుకెళ్లాను. వేరేవాళ్లకోసం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ క్లీన్‌చిట్‌తో బయటకు వచ్చాను. నాకు నక్సలైట్‌ ఆర్కే అంటే ఇష్టం. ఆయన ప్రజల కోసం పోరాడింది పుస్తకాల్లో చదివాను. నా అదృష్టం కొద్దీ ఆయన పాత్రలో నటించాను.

నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. మధ్యలో కొన్ని కారణాల వల్ల ట్రాక్‌ తప్పాను. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. సినిమాల్లోకి రావడానికి చిరంజీవిగారే నాకు స్ఫూర్తి. ఈమధ్యే అనంత సినిమా తీశాను. నేనే హీరోగా చేసి నిర్మించాను. ఇండస్ట్రీలో చాలా రాజకీయాలుంటాయి. వాటిని తట్టుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్‌.

చదవండి: పెళ్లి కోసమే సినిమాలకు దూరంగా రాశీ ఖన్నా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)