Breaking News

హీరోయిన్‌ అంజలితో రిలేషన్‌? కోన వెంకట్‌ ఆన్సరిదే..

Published on Mon, 03/10/2025 - 13:03

రచయితగా, నిర్మాతగా రెండు దశాబ్దాలుగా సినీసీమలో కొనసాగుతున్నాడు కోన వెంకట్‌ (Kona Venkat). ఒకప్పుడు ఎక్కువ హిట్లు అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో జిన్నా, గీతాంజలి మళ్లీ వచ్చింది వంటి చిత్రాలతో పరాజయాల బాట పట్టాడు. హీరోయిన్‌ అంజలితో నిశ్శబ్ధం, డిక్టేటర్‌, గీతాంజలి, గీతాంజలి మళ్లీ వచ్చింది, శంకరాభరణం.. ఇలా పలు సినిమాలు చేశాడు. దీంతో దర్శకుడికి, అంజలికి మధ్య ఏదో ఉందన్న రూమర్స్‌ మొదలయ్యాయి. 

అంజలిపై సాఫ్ట్‌ కార్నర్‌
వీరు రిలేషన్‌లో ఉన్నారని పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై కోన వెంకట్‌ స్పందిస్తూ.. అంజలి (Actress Anjali) పై నాకు సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది. తనను చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా.. ఎలా పిలవమన్నా పిలుస్తాను. తన వ్యక్తిగత జీవితం చాలా తక్కువమందికే తెలుసు. తన బాల్యం సంతోషకరంగా సాగలేదు. పేరెంట్స్‌ దగ్గర కూడా ఎప్పుడూ లేదు. పిన్ని దగ్గరే పెరిగింది. ఆమె కూడా సరిగా చూసుకునేది కాదు.

ఆస్తి కబ్జా
తనకు ఒక సపోర్ట్‌ కావాలనిపించింది. తన బాధ చెప్పుకునేందుకు ఓ మనిషి ఉంటే బాగుండనిపించింది. నా కూతురికి ఏదైనా అవసరం ఉందంటే ఎలా నిలబడతానో అంజలికి కూడా ఎల్లప్పుడూ అలాగే నిల్చున్నాను. దాన్ని రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. నేనవేవీ పట్టించుకోను. గీతాంజలి సినిమా సమయంలోనే అంజలి నాకు తొలిసారి పరిచయమైంది. అదే సమయంలో చెన్నైలో తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమె పిన్నివాళ్లు అంజలి ఆస్తిని కబ్జా చేశారు. అలాంటి సమయంలో నిస్వార్థంగా తనకు అండగా నిలబడే ఓ స్నేహితుడు అవసరం అనిపించింది. 

నా చేతుల మీదుగా ఇవ్వమని ఆశపడింది
నన్ను ఫ్రెండ్‌, అన్న, తండ్రి, గురువు, దైవం.. ఏదనుకున్నా పర్లేదు. నేను పోలీసులతో మాట్లాడి తనకు అండగా నిలబడ్డాను. ఆమె తొలిసారి బీఎమ్‌డబ్ల్యూ కారు కొనుకున్నప్పుడు నా చేతుల మీదుగా ఇవ్వమని అడిగింది. సరేనని నా చేతులమీదుగా కారు తాళాలు తన చేతికిచ్చాను. దానికి నేనేదో ఆమెకు కారు గిఫ్ట్‌ ఇచ్చానని రాసేశారు. మా అనుబంధానికి మీరు ఏ పేరైనా పెట్టుకున్నా నేను పట్టించుకోను అని కోన వెంకట్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: #SSMB29: వాట్‌ ద ఎఫ్‌.. రాజమౌళి?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)