Breaking News

ఎంతమంది అడ్డుపడినా ఆ రోజే సినిమా విడుదల చేస్తాం: కోన వెంకట్‌

Published on Mon, 03/25/2024 - 12:55

హీరోయిన్‌ అంజలి టైటిల్‌ రోల్‌లో నటించిన హారర్‌ కామెడీ ఫిల్మ్‌ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. ఏప్రిల్‌ 11న విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని ఆపాలంటూ ఇండస్ట్రీకి చెందిన నట్టి కుమార్ ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాశాడు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను వైఎస్సార్ సీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మించడమే అని తెలుస్తోంది. 

ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్  సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ సంయుక్తంగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాను నిర్మించారు. ఈ క్రమంలో ఎలక్షన్‌ కమిషన్‌కు నట్టి కుమార్ రాసిన లేఖపై  కోన వెంకట్‌ ఇలా స్పందించారు. ' గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాం. కానీ ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నట్టి కుమార్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాశారు. సినిమా విషయంలో ఆయనకు రూల్స్‌ తెలుసుకుని ఆ లేఖ రాసి ఉంటే బాగుండేది.

ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని ఆ నిర్మాత లేఖ రాస్తే బాగుండేది. ఈ సినిమా ఎవరు ఆపినా ఆగేది కాదు. ఎలక్షన్స్‌కు సినిమాలకు దయచేసి ముడిపెట్టొద్దు. సినిమా అనేది ఒక పార్టీకి,కులానికి,మతానికి చెందినది కాదు. ఈ సినిమా కోసం కొన్ని వందలమంది కళాకారులు, టెక్నీషియన్లు పనిచేశారు. దయచేసి సినిమాను రాజకీయం చేయకండి. ఎప్రిల్‌ 11న ఈ సినిమా తప్పకుండా విడుదల అవుతుంది. సినిమాను ఆపేందుకు ఎవరు అడ్డుపడినా.. ఎంతమంది అడ్డుపడినా.. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా అనుకున్న రోజే సినిమా విడుదల అయి తీరుతుంది. అని ఆయన తెలిపారు.

‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ‘గీతాంజలి’ (2014) సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో కూడా అంజలి, సత్యం రాజేష్, శ్రీనివాస్‌ రెడ్డి, షకలక శంకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైలర్‌కు  ఎప్రిల్‌ 11న ఈ సినిమా విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)