Breaking News

బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. దాదాపు 22 ఏళ్ల తర్వాత వస్తోంది!

Published on Sun, 03/17/2024 - 15:10

కోలీవుడ్‌లో మరచిపోలేని చిత్రాల్లో అళగి ఒకటని చెప్పుకోవచ్చు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తంగర్‌ బచ్చన్‌ తెరకెక్కించిన తొలి చిత్రం ఇదే. ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. హృదయాలను హత్తుకునే కథా, కథనాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. నటుడు పార్తీపన్‌, నందితాదాస్‌, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఉదయగీత సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఉదయకుమార్‌ నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. 

2002లో విడుదలైన ఈ వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రం అప్పుట్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా చెప్పాలంటే కమలహాసన్‌ నటించిన పంబల్‌ కే.సంబంధం, అజిత్‌ హీరోగా నటించిన రెడ్‌ వంటి భారీ చిత్రాల మధ్య విడుదలైన అళగి చిత్రం అన్నింటికంటే పెద్ద విజయం సాధించింది. ఇళయరాజా సంగీత బాణీలు సంగీత ప్రియులను అలరించాయి. 

తీరం దాటని పాఠశాల ప్రేమకథా చిత్రంగా అళగి తెరకెక్కింది. ఈ తరం ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన చిత్రం అళగి. ఈ తరం యువతకు అందించాలనే ఉద్దేశంతో అళగి చిత్రాన్ని 22 ఏళ్ల తరువాత మళ్లీ ఆధునిక డిజిటల్‌ టెక్నాలజీతో కొత్త హంగులు అద్ది.. ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఉదయకుమార్‌ తెలిపారు. ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ తరం యువత చూడాల్సిన కథా చిత్రం అళగి అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేయడాన్ని దర్శకుడు తంగర్‌బచ్చన్‌ సంతోషం వ్యక్తం చేశారన్నారు. దీనికి ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. ఇకపోతే అళగి చిత్రానికి సీక్వెల్‌ను కూడా చేసే ఆలోచన ఉందని నిర్మాత ఉదయకుమార్‌ చెప్పారు.

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)