Breaking News

ఈ ముగ్గురు సినిమా స్టార్స్‌ ధరించిన 'కరుంగలి దండ' గురించి తెలుసా..?

Published on Fri, 03/29/2024 - 19:30

చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్‌కు చెందిన స్టార్స్‌ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

కారణం ఏమిటంటే..: లోకేష్‌ కనగరాజ్‌
'విక్రమ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాధానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ కరుంగలి దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్‌ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.' అని ఆయన చెప్పారు.

కరుంగాలి మాల అంటే..
కరుంగలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే  ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని  జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్‌ పెరిగింది.

ఆన్‌లైన్‌‌లో దొరికే మాలలన్నీ డూప్లికేట్‌ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్‌ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని  ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు.

శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే
కరుంగలి మాలను కోలీవుడ​ నుంచి  శివకార్తికేయన్, ధనుష్‌ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ..  'ఈ కరుంగలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.' అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్‌ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)