Breaking News

స్టార్ హీరో కొత్త చిత్రం.. టైటిల్ ఫిక్స్!

Published on Mon, 12/04/2023 - 12:28

మార్క్ ఆంటోనీ చిత్రం తర్వాత కోలీవుడ్ హీరో విశాల్‌ మరో చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా టైటిల్‌ ప్రకటించారు మేకర్స్. ఇంతకు ముందు హరి.. పూజై, తామిర భరణి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూవీని  స్టోన్‌ బెంచ్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.  

తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్‌ సాధించడానికి డైరెక్టర్ హరి రెడీ అయిపోయారు. సాధారణంగా అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌ టైనర్‌ కథా చిత్రాల కేరాఫ్‌గా మారిన హరి.. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ కథా చిత్రమని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. దీనికి రత్నం అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తాజా సమాచారం.

తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్‌లో నటుడు విశాల్‌ ఒక వ్యక్తి తలను నరికే సన్నివేశం ఉంది. ఈ ఒక్క సీన్ చూస్తేనే మరో పక్క కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, తూత్తుక్కుడి, చైన్నె ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు యూనిట్‌ వర్గాలు వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  దర్శకుడు గౌతమ్‌ మీనన్‌, సముద్రఖని, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)