విశ్వనటుడితో మాజీ ప్రపంచసుందరి.. ఆ క్రేజీ ప్రాజెక్ట్‌లోనే!

Published on Thu, 01/11/2024 - 15:52

కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్‌ గతేడాది కథానాయకుడిగా నటించి, నిర్మించిన విక్రమ్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదేవిధంగా తెలుగులో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న కల్కీ చిత్రంలో కమలహాసన్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రం ఈ నెలలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనకి థగ్స్‌ లైఫ్‌ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేయగా.. అందులో కమలహాసన్‌ తన శత్రువులతో తన పేరు రంగరాయ శక్తివేల్‌ నాయకన్‌. కాయల్‌ పట్టికారన్‌( కాయల్‌పట్టికి చెందిన వాడిని) అని చెప్పే డైలాగ్స్‌ థగ్స్‌ లైఫ్‌ చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. 

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో త్రిష, కమలహాసన్‌కు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ భారీ క్రేజీ చిత్రంలో దర్శకుడు మణిరత్నం అభిమాన నటి, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కమలహాసన్‌, ఐశ్వర్యారాయ్‌ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. త్రిష, జయంరవికి గానీ, దుల్కర్‌సల్మాన్‌కుగానీ జంటగా నటించే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌, జయంరవి, త్రిష ముఖ్యపాత్రలు పోషించనున్నారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)