Breaking News

స్టార్‌ హీరో గొప్పమనసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు!

Published on Sun, 02/04/2024 - 15:37

పరుత్తివీరన్‌ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు కార్తీ. సూర్య సోదరుడిగా పలు సూపర్ హిట్‌ చిత్రా లలో నటించారు. గతేడాది జపాన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటిదాకా 25 సినిమాలు చేసిన భారీ ఎత్తున సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్తీ -25 పేరుతో జరిగిన వేడుకలో సమాజంలో మంచి కార్యక్రమాల కోసం రూ.కోటి వెచ్చించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. 

అంతే కాదు చెప్పిన విధంగానే పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న 25 మందిని ఎంపిక చేసి వారికి తలా రూ.లక్ష సాయం చేసే కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రారంభించారు. ఇందులో స్వచ్ఛందంగా అనాథ పిల్లలను ఆదుకుంటున్న వారికి, విద్య, వైద్య సేవలను అందిస్తున్న వారికి, దివ్యాంగులను ఆదుకుంటున్న వారికి అంటూ 25 మందిని ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు.  వారిలో ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు సాయాన్ని అందించారు. 

అనంతరం కార్తీ మాట్లాడుతూ.. తాను నటుడిగా 25 చిత్రాలను పూర్తి చేసిన సందర్భంగా రూ.కోటి రూపాయలతో సహాయ కార్యక్రమాలను నిర్వహించాలని భావించానన్నారు. అందులో భాగంగా ఇటీవల తన అభిమాన తమ్ముళ్లతో చైన్నెలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రోజుకు 1000 మందికి చొప్పున 25 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ్ముళ్ల ఆలోచన ప్రకారం వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలను అందిస్తున్న వారిని ప్రోత్సహించే విధంగా నగదు సాయం చేయాలని తలపెట్టిన కార్యక్రమమని పేర్కొన్నారు. ఆ విధంగా సేవాతత్పరులు 25 మందికి రూ.లక్ష అందించినట్లు చెప్పారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలను తన ఉళవన్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ద్వారా చేపట్టునున్నట్లు కార్తీ తెలిపారు.

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)