Breaking News

అలాంటి వారికే నేనేంటో తెలుస్తుంది: ధనుష్‌

Published on Fri, 12/06/2024 - 15:24

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్‌కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో  ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్‌కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక  నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.

కెరీర్ ప్రారంభంలో ధనుశ్‌ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్‌ భాగమయ్యాడు. అయితే ధనుశ్‌పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ ‌షీట్స్‌ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్‌తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్‌కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు.  తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న  వారే  తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్‌ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో  నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)