Breaking News

భారీ బడ్జెట్‌తో చేయగలరా అని డైరెక్టర్‌ను అడిగా: ధనుశ్

Published on Fri, 01/05/2024 - 15:14

కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన తాజా చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌. అరుణ్‌ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించిన ఈ భారీ పీరియాడికల్‌ కథా చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్‌ సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా  చైన్నెలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈవెంట్‌కు ధనుశ్ తన ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యులతో పాల్గొనడం విశేషం. ఇటీవల కన్నుమూసిన నటుడు విజయకాంత్‌కు నివాళులు అర్పించాకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ వేదికపై ధనుష్‌ మాట్లాడుతూ.. 'చిన్న చినుకు పెను తుపాన్‌గా మారుతుందని అంటారని. అదేవిధంగా 2002లో చిన్న చినుకుగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తాను ఇప్పుడు పెను తుపాన్‌గా ఎదిగాను. ఇప్పుడు తాను సంపాదించుకున్న సొత్తు అభిమానులే అని పేర్కొన్నారు. ఇకపై ఈ చిత్రాన్ని చూస్తే ముందుగా గుర్తొచ్చేది శ్రమ అన్నారు.  దర్శకుడు అరుణ్‌ మాతీశ్వరన్‌ను చూస్తున్నప్పుడు తనకు వెట్రిమారన్‌ గుర్తుకు వస్తారన్నారు. 

ఆయన మొదటిగా కలుసుకున్నప్పుడు ఈ తమ్ముడా దర్శకుడు అని అనిపించిందన్నారు. అయితే కథ విన్న 15 నిమిషాల తరువాత భారీ బడ్జెట్‌ అవుతుందిగా.. సాధ్యం అవుతుందా? అని అడిగానన్నారు. అందుకాయన అలాగే చేద్దామని చెప్పారన్నారు. ఇటీవల చిత్రాన్ని చూశానని ఆయన చెప్పినట్టుగానే ఉందని పేర్కొన్నారు. కెప్టెన్‌ మిల్లర్‌ విజయం సాధించడం తథ్యమని ధనుష్‌ పేర్కొన్నారు. 

గౌరవమే స్వాతంత్య్రం అన్నది ఈ చిత్ర ట్యాగ్‌ అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఎవరికి గౌరవం ఉంది. ఎవరికి స్వాతంత్య్రం ఉంది అన్నది తనకు తెలియడం లేదన్నారు. ఏం చేసినా ఆలోచించి చేయాల్సి వస్తుందని.. అలా ఆలోచించి చేసిన మంచి పనును కూడా తప్పు పట్టేందుకు ఒక వర్గం ఉండటమే స్వాతంత్య్రమా అని ప్రశ్నించారు. తన వరకు అది స్వాతంత్య్రం కాదని ధనుష్‌ పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)