Breaking News

నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!

Published on Wed, 11/27/2024 - 13:38

కోలీవుడ్‌లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్‌.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై తాజాగా దావా వేశారు. 

గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్‌ రౌడీ దాన్‌ మూవీలోని మూడు సెకన్ల క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. 

‍‍అసలేం జరిగిందంటే..

ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్‌ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్‌ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్‌ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార  డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)