Breaking News

విజయ్‌ పార్టీలో స్టార్‌ నటుడి కుమారుడు.. గతాన్ని తలుచుకుని ఎమోషనల్‌

Published on Thu, 03/14/2024 - 10:10

తమిళ సినీ నటుడు విజయ్‌ నాయకత్వంలోని 'తమిళగ వెట్రిక్కళగం'లో సభ్యులుగా చేరేందుకు రాష్ట్రంలోని యువకులు పోటీ పడ్డారు. ఆయన పిలుపు ఇచ్చిన 24 గంటల్లోనే 50 లక్షల మందికి పైగా సభ్యులుగా పేర్లను నమోదు చేసుకున్నారు.  సభ్యత్వం పొందినవారిలో యాభైశాతానికి పైగా యువతీయువుకులే ఉన్నారని  సమాచారం. 

ఈ సందర్భంలో, ప్రముఖ నటుడు నాజర్ కుమారుడు 'నూరుల్ హసన్ ఫైజల్' విజయ్‌ పార్టీలో చేరారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విజయ్‌ సార్‌ అంటే ఎనలేని అభిమానంతో పార్టీలో చేరినట్లు ఆయన అమ్మగారు 'కెమిలా' ఈ సందర్బంగా చెప్పారు.

ఈ క్రమంలో విజయ్‌తో ఉన్న అనుబంధాన్ని ఆమె ఇలా గుర్తుచేసుకున్నారు. 'నా కుమారుడు చిన్నప్పటి నుంచి విజయ్ సార్‌ను అభిమానిస్తాడు. కొన్నాళ్ల క్రితం అతను యాక్సిడెంట్‌కి గురి కావడంతో ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. కనీసం మమ్మల్ని కూడా గుర్తుపట్టలేదు. కానీ విజయ్‌ సార్‌ని మాత్రమే ఆ సమయంలో గుర్తుపట్టాడు. ఆ తర్వాత విజయ్‌ సార్‌ మా ఇంటికి వచ్చి ఆయన్ను ఓదార్చారు.' అని  నాజర్‌ సతీమణి గుర్తుచేసుకున్నారు.

ఈరోజు తమ కుమారుడు ఇలా ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం విజయ్‌ అంటూ నాజర్‌ కూడా ఎమోషనల్‌ అయ్యాడు. విజయ్‌ పార్టీ పెట్టి తన అభిమానులకు పిలుపు ఇవ్వడంతో వెంటనే తమ కుమారుడు ఫైజల్‌ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు ఆయన అన్నారు. విజయ్ సార్ రాజకీయాల్లోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని ప్రస్తుత వాతావరణంలో మార్పు రావాలని ఆయన చెప్పుకొచ్చారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)