Breaking News

మహేశ్‌ - రాజమౌళి సినిమాలో మరో పాన్‌ ఇండియా హీరో!

Published on Fri, 05/16/2025 - 07:17

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కలయికలో మొదలైన సినిమా ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో కె.ఎల్‌. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా కోలీవుడ్‌ నుంచి స్టార్‌ యాక్టర్‌ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్ పైకి కూడా వస్తాడనేది నెట్టింట వైరల్‌ అవుతుంది.

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లోకి తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ జాయిన్‌ కాబోతున్నాడని సమాచారం. ఈమేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయట. గతంలో కూడా  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎంట్రీ గురించి మొదట రూమర్స్‌తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్‌ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్‌ మొదలైంది. మే నుంచి జూన్‌ వరకు ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం  హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ నేతృత్వంలో బిగ్‌ యాక్షన్‌  ఎపిసోడ్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సీన్‌ నుంచే విక్రమ్‌ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’లో విక్రమ్‌ నటించబోతున్నట్లు గతేడాదిలోనే ఈ రూమర్స్‌ వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమ్ ఇలా స్పందించాడు. 'రాజమౌళి, నేను రెగ్యూలర్‌గానే టచ్‌లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ,  మహేష్ మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు జరగలేదు' అని ఆయన తెలిపారు. గతంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా తనపై రూమర్స్‌ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్‌ అయ్యాడు. ‍కొంత కాలానికి మహేష్‌ సినిమాలో తాను భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే  జరుగుతుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)