అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఓటీటీకి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. అది కూడా నెల రోజుల్లోపే!
Published on Wed, 10/16/2024 - 19:02
ఓటీటీల్లో హారర్, యాక్షన్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే ఇటీవల అలాంటి కంటెంట్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. అదే తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ కడైసీ ఉలగ పోర్. హిప్ హాప్ తమిళ ఆది స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు కథ అందించడంతోపాటు డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరో అన్నీ అతడే కావడం విశేషం.
ఈ తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతనెల సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో నాజర్, నట్టీ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ల వద్ద పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ అలరిస్తుందేమో వేచి చూడాల్సిందే.
Directing a movie changes your perspective on various things. #KadaisiUlagaPor was one such experience. pic.twitter.com/NNsn7H9dEv
— Hiphop Tamizha (@hiphoptamizha) September 29, 2024
Tags : 1