రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు
Breaking News
జాతీయ అవార్డ్ ప్రకటన.. చైల్డ్ ఆర్టిస్ట్ ఫుల్ ఎమోషనల్
Published on Sun, 07/19/2026 - 17:05
తాజాగా జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2024 ఏడాదిలో రిలీజైన సినిమాలకు గానూ ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు సైతం సత్తాయి చాటాయి. కమిటీ కుర్రోళ్లు మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అలాగే కోలీవుడ్లో పలు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ దక్కాయి.
అయితే కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మూవీ మహారాజా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చైల్ట్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్కు జాతీయ అవార్డ్ దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్లో వీక్షించిన సచనా.. తనపేరు వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా ఏడుస్తూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటి
విజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్గా మెప్పించిన సచనా నమీదాస్ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026
Tags : 1