మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
చర్చనీయాంశంగా మారిన విశాల్ టాటూ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?
Published on Tue, 01/24/2023 - 18:49
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయారు. కానీ అప్పటినుంచి ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమనే చెబుతూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా దిగ్గజ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నారు. గతంలో విశాల్ పలుమార్లు తాను ఎంజీఆర్‌కు అభిమాని అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ సందర్బం లేకుండా విశాల్ తన ఛాతిపై ఎంజీఆర్ టాటూను వేయించుకోవడం ఆసక్తిగా మారింది.
వచ్చే ఎన్నికల్లో విశాల్ అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైనా సినిమా కోసం ఇలా టాటూ వేయించుకున్నారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
#NikilNews23 #NikilVideos
— Nikil Murukan (@onlynikil) January 24, 2023
*புரட்சி தலைவர் எம். ஜி.ஆர் படத்தை தன் நெஞ்சில் பச்சைகுத்தி இருக்கும் நடிகர் விஷால் அவர்கள்* #Vishal @VishalKOfficial @HariKr_official @VffVishal #MGR pic.twitter.com/AmmqIsook5
Tags : 1