Breaking News

తమిళ సినిమాకు వచ్చిన జాతీయ అవార్డులు ఇవే

Published on Fri, 08/25/2023 - 06:53

69వ సినీ జాతీయ అవార్డుల వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. ఇందులో తమిళ చిత్ర పరిశ్రమ నాలుగు అవార్డులను గెలుచుకోవడం, అవన్నీ చిన్న చిత్రాలు కావడం మరింత విశేషం. మణికంఠన్‌ దర్శకత్వం వహించిన కడైసి వ్యవసాయి చిత్రం ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. అదే విధంగా ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన (లేట్‌) నల్లుండికి ప్రత్యేక అవార్డును ప్రకటించింది.

పార్తీపన్‌ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఇరైవిన్‌ నిళల్‌ చిత్రంలోని మాయవా ఛాయవా అనే పాటను పాడిన శ్రేయ ఘోషల్‌ను ఉత్తమగాయని అవార్డు వరించింది. కాగా ఈవీ గణేష్‌ బాబు దర్శకత్వం వహించిన కరువరై చిత్రానికి గాను సంగీత దర్శకుడు శ్రీకాంత్‌ దేవాకు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వరించింది.

(ఇదీ చదవండి: 2023 :అల్లు అర్జున్‌... ఉత్తమ నటుడు)

ఈ సందర్భంగా తన చిత్రంలోని పాటకు గాను ఉత్తమ గాయని అవార్డును ప్రకటించిన అవార్డుల కమిటీకి నటుడు పార్తీపన్‌ ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కాగా తెలుగు తేజం ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఈసారి ఏకంగా 6 ప్రధాన అవార్డులను దక్కించుకోవడం విశేషం.

ఉత్తమగాయనిగా శ్రేయ ఘోషల్‌కు జాతీయ అవార్డు తెచ్చిన పాట ఇదే...

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)