Breaking News

ధనుశ్‌తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!

Published on Sun, 01/19/2025 - 20:54

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్‌ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గౌతమ్‌ ఓ మీడియా ‍ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

గతంలో 2019లో ధనుశ్‌తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట ‍అనే మూవీని గౌతమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్‌ రియాక్ట్  అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్‌ మీనన్ అలా రియాక్ట్‌ కావడంపై నెటిజన్స్‌ భిన్నంగా చర్చించుకుంటున్నారు. 

అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్‌ ఎంతో ఫోకస్‌ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో  త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్‌గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్‌ మీనన్ చేసిన కామెంట్స్‌ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్‌ మీనన్ ప్రస్తుతం  డొమినిక్‌ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)