Breaking News

ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్‌ కన్నుమూత

Published on Sun, 02/19/2023 - 11:20

చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు తారకరత్న మరణ వార్తను మరవకముందే మరో నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ కమెడియన్‌ మైల్‌స్వామి(57) కన్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న మైల్‌ స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్ల‌వారు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పరిశీలించిన వైద్యులు అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయార‌ని చెప్పారు. మైల్‌ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మలై స్వామి మరణంపై ట్విటర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ప‌ని చేస్తున్న మైల్ స్వామి 1984లో న‌టుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. 2000 నుంచి కమెడియన్‌గా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. చాలా సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు.  ఆయ‌న త‌మిళంలో న‌టించిన ప‌లు చిత్రాలు తెలుగులోనూ అనువాద‌మై విజ‌య‌వంత‌మ‌య్యాయి. 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)