Breaking News

శృతి హాసన్‌ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. హైదరాబాద్‌ ఈవెంట్ వాయిదా

Published on Fri, 03/28/2025 - 16:14

కమలా హాసన్ నట వారసురాలు శృతిహాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో  పలువురు స్టార్ ‍హీరోల సరసన మెప్పించింది. అయితే శృతి కేవలం హీరోయిన్‌ మాత్రమే కాదు.. అద్భుతమైన సింగర్ కూడా. ఆమె సినిమాలతో పాటు మ్యూజిక్ కన్సర్ట్స్‌కు కూడా హాజరవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ కన్సర్ట్‌ ప్లాన్ చేశారు. ‍అయితే ఊహించని విధంగా ఆడియన్స్‌ షాకిచ్చారు ఆర్గనెజర్స్.  ఇవాళ జరగాల్సిన సంగీత కచేరీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని ఆర్గనైజింగ్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాంకేతిక కారణాలతో శృతిహాసన్ మ్యూజిక్‌ కన్సర్ట్‌ను ఏప్రిల్ 26కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  టిక్కెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్న అతిథులకు అదనపు ఖర్చు లేకుండా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ఎవరైనా ఈవెంట్‌కు టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే డబ్బులు రిఫండ్ ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఉన్నట్లుండి ఈ మ్యూజిక్ కన్సర్ట్‌ను వాయిదా వేయడంపై ఆడియన్స్ మండిపడుతున్నారు.

event

ఇక శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూలీ చిత్రంలో కనిపించనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)