Breaking News

ఆ ఫోటోలు షేర్‌ చేయకండి.. నాకు పెళ్లి అవుతుందనే నమ్మకం లేదు: హీరోయిన్‌

Published on Sat, 04/06/2024 - 07:14

సినిమా తారల ఆడంబరాలే బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. చాలా మంది కష్టాలు, కన్నీ ళ్లు అంతర్గతంగా ఉండిపోతాయి. చాలా మంది రకరకాల వ్యాధులతో బాధ పడుతుంటారు. అయినప్ప టికీ బయటకు నవ్వుతూ కనిపిస్తారు. అది ఏడవ లేక నవ్వడమే అన్నది ఎంత మందికి తెలుస్తుంది. చాలా మంది కేన్సర్‌ బారిన పడి నరకయాతన పడుతున్న వారూ ఉన్నారు. టాప్‌ హీరోయిన్‌ సమంత కూడా మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇక నటి ముంతాజ్‌ (43) కన్నీటి కథ కూడా ఇలాంటిదే. ఆమె తెలుగు, తమిళ పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ఖుషి,అత్తారింటికి దారేది చిత్రాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌లలో ఆమె మెప్పించింది.

కోలీవుడ్‌లో 'మోనీసా ఎన్‌ మోనాలిసా' చిత్రం ద్వారా నటి ముంతాజ్‌ను దర్శకుడు టీ.రాజేందర్‌  పరిచయం చేశారు . ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ముంతాజ్‌కు మా త్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ భామ కొన్ని కారణాలు ఏమైనా ఐటమ్స్‌ సాంగ్స్‌లో నటించి, శృంగార తారగా ముద్రవేసుకున్నారు. తమిళంతో పాటు, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ పలు సినిమాల్లో నటించినా ఆ తరువాత సినీరంగం నుంచి కనుమరుగయ్యారు. ఆమె చివరిగా నటించిన తమిళ చిత్రం రాఘవ లారెన్స్‌ హీరోగా నటించిన రాజాది రాజా. అందులో ప్రతినాయకిగా నటించారు.

ఆ బాధను భరించలేక చనిపోవాలనుకుంటే..
లారెన్స్‌ సినిమా తరువాత తెలుగులో రెండు చిన్న చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో ముంతాజ్‌ పేర్కొంటూ సడన్‌గా తన వెన్నుముక భాగం కదలడానికి కూడా వీలుపడక నొప్పి వచ్చిందన్నారు. ఆ నొప్పిని తట్టుకోలేకపోయానన్నారు. పలువురు వైద్యులు పరీక్షించినా సమస్య ఏమిటో చెప్పలేకపోయారన్నారు. అలా రెండేళ్ల పాటు ఆ బాధను అనుభవించానని చెప్పారు. ఆ తరువాత ఒక ఆప్పత్రిలో పరిశోధన చేయగా తనకు ఆటో ఇమ్యూన్‌ అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యాధి కారణంగా తన శరీరంలో ఎక్కడెక్కడ ఎముకల జాయింట్స్‌ ఉన్నాయో ఆక్కడ భయంకరమైన నొప్పి కలుగుతుందన్నారు.

దీంతో కూర్చోలేక, నిలబడలేక, శరీరాన్ని కదల్చలేక నరకయాతన పడ్డానని చెప్పారు. మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. ఎందుకు ఏడుస్తున్నానో తనకే తెలిసేది కాదన్నారు. అదే మానసిక వ్యాధి అని చెప్పారు. ఒకసారి రెండున్నర గంటల సేపు నాన్‌స్టాప్‌గా ఏడుస్తూనే ఉన్నానని, తన మానసిక వ్యాధిని అర్ధం చేసుకుని అందులోంచి బయటకు తీసుకొచ్చింది తన అన్నయ్యనేనని చెప్పా రు. ఆయన లేకుంటే తానీ పాటికి ఆత్మహత్య చేసుకునేదాన్నని అన్నారు.

నాకు పెళ్లి జరుగుతుందనే నమ్మకం లేదు
తాను గ్లామరస్‌గా నటించినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు ముంతాజ్‌ పేర్కొన్నారు. తన శృంగార భరిత ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నానని, అయితే ఆ పని తనకు సాధ్యం కావడం లేదని అన్నారు. కాబట్టి అభిమానులు సాధ్యమైనంత వరకూ తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయవద్దని వేడుకున్నారు. ఇకపై తనకు వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని, అది జరుగుతుందా? అన్నది వేచి చూద్దాం అని నటి ముంతాజ్‌ తన కన్నీటి కథను పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)